భారతదేశం, ఫిబ్రవరి 11 -- ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్. కాలినడకన తిరుమలకు చేపట్టిన 'సంకల్ప యాత్ర' విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్‌ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత మంగళవారం రోజు తిరులమకు చేరుకున్నారు. సుమారు 535 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు.

అలిపిరి మార్గం నుంచి కాలి నడకన తిరుమలకు బయలుదేరారు. ముందుగా తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గణేష్‌ను చైర్మన్ శాలువాతో సత్కరించి అభినందించారు. తన సంకల్ప యాత్రను ముగించిన నేపథ్యంలో ఇవాళ(బుధవారం) తన కుటుంబంతో కలిసి బండ్ల గణేశ్. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆయన జైలు నుంచి సురక్షితంగా బయటకు వ...