భారతదేశం, ఆగస్టు 17 -- Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు అత్యంత వైభవంగా మోగాయి. ఆయన ముద్దుల కూతురు జనని బండ్ల, సూర్య తేజ చిలుకూరిల వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే కూతురి అప్పగింతల సమయంలో బండ్ల గణేష్ తీవ్ర భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్వడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

పెళ్లి వేడుక ముగిసిన తర్వాత నూతన దంపతులను కారు వరకు సాగనంపే క్రమంలో గణేష్ తన కూతురి చేతిని గుండెలకు హత్తుకుని వదిలిపెట్టడానికి నిరాకరించారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూసి అతిథులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. జనని కూడా తన కన్నీళ్లను ఆపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడం అందరినీ కదిలించింది.

ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ...