భారతదేశం, మే 12 -- Bandi Sanjay Comments : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసుల వ్యవహారంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తాను చట్టాన్ని. న్యాయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.

కరీంనగర్ లో మంగళవారం నిర్వహించిన హిందూ ఎక్తా యాత్ర సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్... నిజంగా తప్పు చేస్తే తన కొడుకును కూడా క్షమించనని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని. తప్పు రుజువైతే చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే అని వ్యాఖ్యానించారు. తన కుమారుడు మాత్రం తాను ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడని.. చివరికి న్యాయస్థానమే నిజాన్ని నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ కక్షసాధింపులో భాగంగా తన కుటుంబాన్ని రోడ్డుకు లాగడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు . "రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నా కుమారుడిని లక్ష్య...