భారతదేశం, మే 10 -- తన కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన ఘటన మీద బండి సంజయ్ స్పందించారు. తనకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నానని, దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను అన్నారు.

తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందన్నారు.

'అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమ...