భారతదేశం, మే 17 -- Bandi Bhagirath POCSO Case : సంచలనం సృష్టించిన పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులోని ప్రధాన నిందితుడు బండి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ కేసులో శనివారం ఉదయం నుంచే అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందస్తు బెయిల్ కోసం, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో శనివారం ఉదయమే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతడిని పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను రంగంల...