భారతదేశం, ఏప్రిల్ 17 -- Band Melam: కోర్ట్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ పెయిర్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బ్యాండ్ మేళం'. ఈ సినిమాలో మరోసారి వీళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులే పడ్డాయి. ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

లేటెస్ట్ తెలుగు యూత్ మూవీ 'బ్యాండ్ మేళం' డిజిటల్ స్ట్రీమింగ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 24 నుంచి జీ5 తెలుగు ఓటీటీలో బ్యాండ్ మేళం సినిమా ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్ శుక్రవారం (ఏప్రిల్ 17) పోస్టర్ షేర్ చేసింది.

''బ్లాక్ బస్టర్ పెయిర్ మళ్లీ రాబోతుంది. మీరు మెచ్చిన జంట మరోసారి దరువు వేయబోతుంది. రిథమ్ కు మీరు రెడీనా? ఏప్రిల్ 24న బ్యాండ్ మేళం ప్రీమియర్ కేవలం జీ5లో...