భారతదేశం, మే 1 -- Balakrishna Sekhar Kammula: బాలకృష్ణ, శేఖర్ కమ్ముల.. అసలు ఈ పేర్లు పక్కపక్కన ఉండటమే ఓ ఆశ్చర్యం. అలాంటిది వీళ్లిద్దరూ కలిసి ఓ మూవీ చేయబోతుండటం మరింత ఆశ్చర్యం కలిగించేదే. ఒకరు క్లాస్ సినిమాల డైరెక్టర్.. మరొకరు గాడ్ ఆఫ్ మాసెస్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది.

బాలకృష్ణ, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాబోతుందన్నది ఈ వార్త సారాంశం. ఇప్పటికే సోషల్ మీడియాతోపాటు పలు రిపోర్టులు దీనిని తెరపైకి తీసుకొచ్చినప్పటి నుంచీ అభిమానుల్లో ఒకటే చర్చ నడుస్తోంది. అసలు బాలయ్య మాస్ ఇమేజ్ కు శేఖర్ లాంటి క్లాస్ డైరెక్టర్ ఎలాంటి కథను సిద్ధం చేస్తాడు అని. నిజానికి ఇప్పటికే ఓ పవర్ ఫుల్ స్టోరీ కూడా రెడీ అయినట్లు కూడా సమాచారం.

ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ లాంటి యూత్...