భారతదేశం, ఆగస్టు 10 -- భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఎంతోమంది యువత కలల బైక్ అయిన బజాజ్ పల్సర్ 150 సరికొత్త హంగులతో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్‌కు ముందే ఈ బైక్ దేశంలోని కొన్ని సెలెక్టెడ్ డీలర్‌షిప్‌లకు చేరుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే, పల్సర్ ప్రియుల ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుందని స్పష్టమవుతోంది. అనేక సంవత్సరాలుగా మార్కెట్​ని ఏలుతున్న పల్సర్ 150 మెకానిజమ్ అలాగే ఉంచుతూ, చూడటానికి మరింత స్టైలిష్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ కొత్త బజాజ్ పల్సర్ 150 విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ కొత్త మోడల్‌లో ప్రధానంగా ఫ్రంట్ లుక్ పూర్తిగా మారిపోయింది. సరికొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో పాటు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లను జోడించారు. దీనివల్ల పల్సర్ 150 బైక్ మరింత మోడ్రన్ లుక్‌ను సంతరించుకుంది. ఇప్పటివరకు వస్తున్న హాలోజన్ ల్యా...