భారతదేశం, సెప్టెంబర్ 1 -- Badshah: పాపులర్ బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షా, పంజాబీ హీరోయిన్ ఇషా రిఖీ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. గత కొన్ని వారాలుగా వస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ.. సోమవారం (ఆగస్టు 31) రాత్రి వీళ్లు విడాకుల నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకలో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కేవలం ఐదు నెలలకే ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తమ విడాకుల విషయమై బాద్‌షా, ఇషా రిఖీ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒకే రకమైన ప్రకటనను విడుదల చేశారు.

"నేను, ఇషా రిఖీ ఇద్దరం పరస్పర అంగీకారంతోనే వేర్వేరు మార్గాల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. సంపూర్ణమైన పరస్పర గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్...