భారతదేశం, ఏప్రిల్ 23 -- Badrinath Temple Mystery: ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో కొలువైన బద్రీనాథ్ క్షేత్రం భక్తుల సందడితో కళకళలాడుతోంది. శీతాకాలం ముగిసి, మంచు తెరలు తొలగడంతో నేడు ఉదయం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ద్వారాలను అర్చకులు తెరిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా వేల సంఖ్యలో భక్తులు తరలివెళ్లే ఈ వైకుంఠ ధామంలో ఒక వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. హిందూ ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా, పూజలు చేసినా శంఖం ఊదడం సర్వసాధారణం. కానీ, బద్రీనాథ్ ఆలయంలో మాత్రం శంఖం మోగించరు. దీని వెనుక అత్యంత ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది.
పురాణాల ప్రకారం, ఈ ప్రాంతంలో ఒకప్పుడు లక్ష్మీదేవి కఠోరమైన తపస్సులో నిమగ్నమై ఉంది. అదే సమయంలో భగవంతుడైన విష్ణుమూర్తి ఇక్కడ ఒక శక్తివంతమైన రాక్షసుడిని సంహరించాడు. సాధారణంగా ఏదైనా విజయం సాధించిన తర్వాత లేదా రాక్షస సంహారం జర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.