భారతదేశం, మే 15 -- Bad Boy కార్తీక్: శుక్రవారం వచ్చిందంటే ఓటీటీలో కొత్త సినిమాలో జోష్ ఉంటుంది. ఇవాళ అలాగే సెలైంట్ గా ఓ తెలుగు మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య కెరీర్‌లో చాలా కాలంగా వార్తల్లో నిలుస్తూ, పలు వాయిదాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ మూవీ ఇవాళ (మే 15) ఓటీటీలోకి అడుగుపెట్టింది.

నాగశౌర్య హీరోగా నటించిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్' మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సినిమా మేకింగ్ పరంగా క్వాలిటీ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ వెనుకబడటం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.

ఏ మూవీకైన...