భారతదేశం, జూన్ 27 -- Baabubali: ప్రస్తుతం ఇండియన్ సినిమాలో పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తోందంటే దానికి మూలకారణం 'బాహుబలి'. ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర లిఖించింది. కానీ, ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలైన రోజున వచ్చిన టాక్ చూసి తమ కెరీర్ ఇక ముగిసిపోయిందని మూవీ యూనిట్ టెన్షన్ పడిందంటా. దీనికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను చిత్ర యూనిట్ తాజాగా పంచుకుంది.

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన బాహుబలి ది టార్చ్ బేరర్స్ డాక్యుమెంటరీలో బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ డే నాటి పరిస్థితిని రాజమౌళి తలుచుకున్నాడు. "హిందీ, యూఎస్, గల్ఫ్ దేశాల నుంచి బాహుబలికి అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. కానీ, మాకు అసలైన రెవెన్యూ రావాల్సింది ఆంధ్రా, తెలంగాణల నుంచే. అక్కడ మాత్రం మొదటి రోజే అత్యంత దారుణమైన రివ్యూలు వచ్చాయి'' అని రాజమౌళి చెప్పా...