భారతదేశం, జూలై 18 -- Azadi 501 OTT: డిజిటల్ విప్లవం మొదలవుతున్న రోజుల్లో ఒక చిన్న మొబైల్ ఫోన్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రూ.251కే ఫోన్ అంటూ పెద్ద స్కామ్ జరిగింది. ఆ కుంభకోణం వెనుక ఉన్న మిస్టరీ కథను ప్రపంచానికి చెప్పేందుకు 'ఆజాదీ 501' వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.

ఇండియాలో రియల్ టెక్ స్కామ్ కథతో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఆజాదీ 501'. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియో ఈ సిరీస్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది. జూలై 29 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ఆహా వీడియో తాజాగా అనౌన్స్ చేసింది.

ఒకప్పుడు కేవలం రూ. 251లకే స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ కోట్ల మందిని నమ్మించి, ఆ తర్వాత రాత్రికి రాత్రే అదృశ్యమైన ఆ భారీ మోసపూరిత కథే 'ఆజాది 501'. ఈ సిరీస్‌లో ఆ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఆ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్‌మ...