భారతదేశం, జూలై 24 -- Ayesha Khan Reply To Trolls Amid Arrest: నీట్ (NEET) పరీక్షల లీకేజీ అక్రమాలపై దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రముఖ బాలీవుడ్ నటి, తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు వ్యాన్‌లోకి నెట్టి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

జులై 22న ముంబై దాదర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు తన సోదరుడు, స్నేహితులతో కలిసి వెళ్లారు ఆయేషా ఖాన్. అయితే నిరసన ప్రదర్శన ప్రారంభించకముందే పోలీసులు ఆమెను అకారణంగా ఈడ్చుకెళ్లి వోర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పోలీసుల కస్టడీకి సంబంధించిన వీడియోలను ఆయేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక నెటిజన్ "ఇకపై నీకు బాలీవుడ్‌లో ఎలాంటి అవకాశాలు రావు" అంటూ ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి...