భారతదేశం, మే 23 -- Avika Gor: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటనకు, ఆయన ఎంచుకునే వైవిధ్యమైన పాత్రలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతే కాకుండా కో స్టార్స్ కూడా నాని యాక్టింగ్ కు ఫిదా అవుతుంటారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ నానిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఏం చెప్పిందో చూసేయండి.

ఒక ఇంటర్వ్యూలో అవికా గోర్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'మీ జీవితంలో ఒకే ఒక్క హీరోతో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసే అవకాశం వస్తే, మీరు ఎవరిని ఎంచుకుంటారు?' అని యాంకర్ అడిగాడు. దీనికి అవికా క్షణం కూడా ఆలోచించకుండా 'నాని' అని సమాధానం ఇచ్చింది అవికా. నాని నటనలో ఉండే ప్రత్యేకతలే తనను ఇంతలా ఆకర్షించాయని ఆమె వివరించింది.

"నాని కళ్లు చాలా మాట్లాడతాయి. ఆయన భావాలను పలికించే విధానం, న...