భారతదేశం, నవంబర్ 17 -- Avengers Doomsday: హాలీవుడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవెంజర్స్: డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్ ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి. అయితే ఇవి అప్పుడే సంచలనాలు సృష్టిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో '#OpenDoomsdayBookings' హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్ చేసిన డిమాండ్‌కు స్పందిస్తూ, విడుదల తేదీకి సరిగ్గా నెల రోజుల ముందే ఎగ్జిబిటర్లు టికెట్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

డిసెంబర్ 17న అమెరికా కంటే ఒక రోజు ముందే ఈ చిత్రం భారతీయ థియేటర్లలోకి రానుండగా, బుక్ మై షో (BookMyShow), డిస్ట్రిక్ట్ (District) యాప్‌లలో టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అర్ధరాత్రి ప్రత్యేక షోలు, టికెట్ ధరలు, కథాంశం వివరాలను ఇక్కడ చూద్దాం.

మంగళవారం (నవంబర్ 17) మధ్యాహ్నం 12 గంటల నుంచి పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) సహా దేశంలోని ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన...