భారతదేశం, మే 13 -- Avatar 3 OTT Release Date: ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ 'అవతార్' సిరీస్ నుంచి వచ్చిన మూడవ భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar: Fire and Ash) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14 వేల కోట్లకుపైనే) వసూళ్లతో ఈ చిత్రం తన సత్తా చాటింది. ఇప్పుడు ఈ అద్భుత ప్రపంచాన్ని ఇంట్లోనే చూసే అవకాశం రాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం, 'అవతార్: ఫైర్ అండ్ యాష్' జూన్ 24, 2026 నుంచి డిస్నీ+ (Disney+) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మన దేశంలో ఈ మూవీ 'జియోహాట్‌స్టార్' (Jio Hotstar) లో అందుబాటులోకి రాబోతోంది.

గతంలో కొన్ని ప్లాట్‌ఫామ్స్ లో రెంటల్ (అద్దె) ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ సినిమా.. జూన్ 24 నుంచి సబ్‌స్క్రైబర్లందరికీ అదనపు ఛార్...