భారతదేశం, మార్చి 25 -- జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుని ఈ చిత్రం సంచలనం సృష్టించింది. ఇక అవతార్ 3 ఓటీటీ బాట పట్టనుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రంగం సిద్ధమవుతోంది.

సామ్ వర్తింగ్టన్, జో సల్దానా ప్రధాన పాత్రల్లో నటించిన విజువల్ వండర్ అవతార్ 3 బాక్సాఫీస్ వద్ద బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరి రికార్డులు తిరగరాస్తోంది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ అరంగేట్రానికి సిద్ధమైంది. అవతార్ 3 సాధారణ ఓటీటీ స్ట్రీమింగ్‌ కంటే ముందుగా ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) పద్ధతిలో విడుదల కానుంది.

అవతార్ 3 ఓటీటీలోకి రాబోతుంది. అయితే ముందుగా రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులోకి...