భారతదేశం, సెప్టెంబర్ 6 -- Avasarala Srinivas Comments In Tortoise Song Launch: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ సినిమా టార్టాయిస్. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అమృత చౌదరి, ధన్య బాలకృష్ణ నటించగా.. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.

టార్టాయిస్ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించారు. సస్పెన్స్, డ్రామా, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి నీ పరిచయం సాంగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నీ పరిచయం సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నటుడు అవసరాల శ్రీనివాస్, హీరోయిన్ ధన్య బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాట్లాడు...