భారతదేశం, సెప్టెంబర్ 19 -- ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (CDOE) ద్వారా అందించే వివిధ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు సీడీవోఈ డైరెక్టర్ ఆచార్య డి.ఎ. నాయుడు ప్రకటించారు. విశ్వవిద్యాలయ నిధుల కమిషన్ - దూరవిద్య బ్యూరో (UGC-DEB) జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జూలై-ఆగస్టు 2026 విద్యా సంవత్సరానికి గానూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL - ఆఫ్‌లైన్) విధానంతో పాటు ఆన్‌లైన్ లెర్నింగ్ (OL) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

దూరవిద్య ఆఫ్‌లైన్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీ ఎస్‌డీఈ అధికారిక వెబ్‌సైట్ www.andhrauniversity-sde.com ని సందర...