భారతదేశం, మే 7 -- హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో బుధ గ్రహాన్ని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. మన తెలివితేటలు, మాట్లాడే తీరు, వ్యాపార సామర్థ్యం, చర్మ సౌందర్యం, స్నేహ సంబంధాలు అన్నీ బుధుడిపైనే ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి జాతకంలో బుధుడు బలంగా ఉంటే, వారు సమాజంలో మంచి వక్తగా, సమర్థవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తారు. అదే బుధుడు బలహీనంగా ఉంటే మాత్రం జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ మహాదశ సుమారు 17 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ కాలంలో వ్యక్తి జీవితంపై బుధుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బుధుడు మీ జాతకంలో వక్రీకరించి ఉన్నా లేదా మీన రాశిలో ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. అయితే, గోచార రీత్యా బుధుడు వక్రీకరించినప్పుడు కొన్ని సందర్భాల్లో విరుద్ధ రాజయోగం వంటి...