భారతదేశం, ఏప్రిల్ 30 -- హిందూ ధర్మంలో పూజా కార్యక్రమాలకు సంబంధించి శాస్త్రాలు కొన్ని ప్రత్యేక నియమాలను నిర్దేశించాయి. పూజలో స్వచ్ఛత, శుభ్రతకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుకే పూజ గదిని శుభ్రం చేయడం దగ్గర నుంచి, దేవుడికి సమర్పించే నైవేద్యం వరకు ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహిస్తాం. సాధారణంగా దేవుడికి సమర్పించే ప్రతి వస్తువును కడిగి లేదా శుద్ధి చేసి సమర్పించడం మన ఆచారం. కానీ, పువ్వుల విషయంలో మాత్రం ఈ నియమం భిన్నంగా ఉంటుందని మీకు తెలుసా? చాలా మంది పువ్వులపై దుమ్ము ఉంటుందని కడుగుతుంటారు, కానీ శాస్త్రం దీనిని వారించింది.

పూజలో పువ్వులు సమర్పించడం అంటే కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది భక్తుడి ప్రేమకు, శ్రద్ధకు నిదర్శనం. ప్రకృతి ప్రసాదించిన అత్యంత కోమలమైన, పవిత్రమైన వస్తువు పువ్వు. మనలోని నిర్మలమైన భావాలను భగవంతుడికి నివేది...