భారతదేశం, సెప్టెంబర్ 20 -- జపాన్‌లోని ఐచి-నాగోయా నగరంలో జరుగుతున్న 2026 ఆసియా గేమ్స్​లో భారత్ శుభారంభం చేసింది. క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పతకాల పట్టికలో ఇండియా తన ఖాతాను అధికారికంగా తెరిచింది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్‌కు ఎప్పుడూ బలమైన కోటగా నిలిచే షూటింగ్ విభాగంలోనే ఈసారి కూడా తొలి పతకం రావడం విశేషం! మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఇళవేనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్సా వినోద్​లు రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.

మరోవైపు.. టీవీ రియాలిటీ షో 'రోడీస్' మాజీ కంటెస్టెంట్, 36 ఏళ్ల భారత మహిళా ఫైటర్ సుచిక తరియాల్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) క్రీడలో సరికొత్త చరిత్ర సృష్టించింది! ఆదివారం జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన ఆల్టన్‌చిమెగ్ బైగల్మాప...