భారతదేశం, మే 11 -- Ashu Reddy Emotional Post On Bharath Kanth Death: హైదరాబాద్ నగర శివార్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లే వాహనాలకు నిలయమైన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఒక యువ హీరోను బలితీసుకుంది. మే 10వ తేదీ రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరో భరత్ కాంత్ (31) మరణించారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో భరత్ కాంత్ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ఈ ఘటనలో హీరో భరత్ కాంత్‌తో పాటు కారులో ఉన్న యూట్యూబర్ జి. సాయి త్రిలోక్ కూడా ప్రా...