భారతదేశం, మే 9 -- Ashu Reddy: వామ్మో.. అషు రెడ్డి ఎంత పని చేసింది? ఎంగేజ్మెంట్ అని ఇంత మోసం చేస్తుందా? జనాలను పిచ్చోళ్లను చేస్తుందా?.. ఇప్పుడు అషుపై ఫైర్ అవుతున్న నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఇవి. ఇందుకో కారణం ఉంది. శుక్రవారం (మే 8) చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ తో ఫొటో పెట్టిన అషు.. శనివారం (మే 9) ట్విస్ట్ ఇచ్చింది.

శుక్రవారం అషు రెడ్డి ఇన్ స్టాలో చేతికి ఎంగేజ్మెంట్ రింగ్, ఒక అబ్బాయి చేయి పట్టుకున్న ఫొటోలను పోస్టు చేసింది. దీంతో ఈ బిగ్ బాస్ బ్యూటీకి ఎంగేజ్మెంట్ అయిందని అందరూ అనుకున్నారు. చీటింగ్ కేసు విచారణ సాగుతున్న వేళ అషు ఎంగేజ్మెంట్ తో షాకిచ్చిందని భావించారు. కానీ అషునే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇది రియల్ ఎంగేజ్మెంట్ కాదని ఇవాళ పోస్టు పెట్టింది.

ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అనే వెబ్ స...