భారతదేశం, జూన్ 23 -- ప్రస్తుతం జ్యేష్ఠ మాసం నడుస్తోంది. ఈ నెల పూర్తయిపోయిన తర్వాత ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసం 2026 జూలై 15న మొదలై, ఆగస్టు 12తో ముగుస్తుంది. ఈ నెలలో తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, ఆషాఢ అమావాస్యతో పాటు మరికొన్ని ముఖ్యమైన రోజులు వస్తాయి.

ఆషాఢ మాసంలో చాలా పద్ధతులను పాటిస్తూ ఉంటాము. ఆషాఢ మాసంలో ఏ రోజు అత్యంత పవిత్రమైనది? ఆషాఢ మాసంలో మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? ఆషాఢ మాసంలో దరిద్రం కలగకుండా ఉండాలంటే ఎలాంటి తప్పులు చేయకూడదు? ఆషాఢ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి పొరపాట్లు చేయకూడదు? వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ఆషాఢ మాసం జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. ఆషాఢ మాసంలో పరిశుభ్రత, దానధర్మాలు, భక్తి, నియమ నిష్ఠలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. శుభ్రత, స...