భారతదేశం, ఏప్రిల్ 12 -- Asha Bhosle Dance: ఇండియన్ సినిమా సంగీత శిఖరం, తన గాత్రంతో ఎన్నో తరాలను ఉర్రూతలూగించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోంస్లే (92) కన్నుమూసిన విషయం తెలుసు కదా. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె తాను ఇచ్చిన చివరి షోలో 91 ఏళ్ల వయసులో తౌబా తౌబా పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ.. 91 ఏళ్ల వయసులో కూడా ఆశా భోంస్లే ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆమె చివరిసారిగా 2024 డిసెంబర్ 29న దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో 'ఆశా భోంస్లే & సోనూ నిగమ్ లెగసీ కన్సర్ట్'లో ప్రదర్శన ఇచ్చారు.

ఆ వేదికపై ఆమె పాడిన పాటలకంటే, ఇటీవల సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించిన 'తౌబా తౌబా' పాటకు ఆమె వేసిన స్టెప...