భారతదేశం, మే 2 -- సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ప్రపంచం శరవేగంగా మారుతోంది. మొన్నటి వరకు కోడింగ్‌లో కేవలం 'అసిస్టెంట్'గా సాయం చేసిన ఏఐ, ఇప్పుడు 'పవర్‌హౌస్‌'గా మారిపోయింది! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు గంటల తరబడి కష్టపడి రాసే కోడ్‌ను ఇప్పుడు ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్ సెకన్లలో పూర్తి చేస్తోంది. తాజాగా సెకోయా క్యాపిటల్ టాక్‌లో మాట్లాడిన ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, ఈ మార్పు ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు.

గతేడాది డిసెంబర్ నాటికి ఏఐ టూల్స్ కేవలం 20 శాతం కోడ్‌ను మాత్రమే రాసేవని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 80 శాతానికి చేరుకుందని బ్రాక్‌మన్ తెలిపారు. దీని అర్థం ఏంటంటే.. ప్రాజెక్టులో ప్రధానమైన కోడింగ్ పనిని ఏఐ పూర్తి చేస్తోంది, మనుషులు కేవలం దానిని పర్యవేక్షించే 'సూపర్‌వైజర్లు'గా మారుతున్నారు.

కేవలం ఓపెన్ ఏఐ మాత్రమే కాదు, గూగుల్ సీఈ...