భారతదేశం, ఏప్రిల్ 12 -- చైనాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) పరిధిపై సరికొత్త చర్చకు దారితీసింది. మరణించిన వ్యక్తిని ఏఐ రూపంలో తిరిగి సృష్టించి, ఆ విషాదాన్ని ఒక వృద్ధురాలి నుంచి దాచిన ఈ ఘటన భావోద్వేగాలకి, నైతిక విలువలకు మధ్య ఉన్న సన్నని గీతను ప్రశ్నిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో మరణించిన కొడుకు మరణవార్తను తట్టుకోలేదని, చైనాలోని ఒక కుటుంబం ఏఐ టెక్నాలజీతో అతడి 'డిజిటల్ ట్విన్'ను సృష్టించింది. 80 ఏళ్ల ఆ తల్లి తన కొడుకు బతికే ఉన్నాడని నమ్ముతూ రోజూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

జాంగ్ జెవీ నేతృత్వంలోని ఏఐ బృందం సహాయంతో ఈ 'డిజిటల్ ట్విన్'ను రూపొందించారు. మరణించిన వ్యక్తి పాత ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డింగ్‌లను ఉపయోగించి అచ్చం అతనిలాగే కనిపించే, మాట...