భారతదేశం, జూన్ 2 -- AR Rahman Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది' (Peddi). జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ అంబరాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్న ఏఆర్ రెహమాన్ చేసిన కొన్ని క్రేజీ కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

సినిమాలోని కొన్ని ఎమోషనల్ సీన్స్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి రెహమాన్ మాట్లాడుతూ ఎక్స్‌లెంట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

"నేను ఆ సీన్స్ చూసినప్పుడు.. 'ఈ సీన్లను చరణ్ ఎలా చేయగలడు? ఆ ఎమోషన్‌ను ఎలా ఫీల్ అవుతాడు?' అని బాగా సర్ ప్రైజ్ అయ్...