భారతదేశం, నవంబర్ 23 -- AR Rahman: రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1) బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ దృశ్యకావ్యానికి నితీష్ తివారీ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ దిగ్గజం హన్స్ జిమ్మర్ (Hans Zimmer) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. తాజాగా గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికపై ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం తాను చేసిన త్యాగాలను బయటపెట్టారు.

ఆదివారం జరిగిన ఇఫీ (IFFI) చర్చాగోష్టిలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్.. 'రామాయణం' సంగీత ప్...