భారతదేశం, నవంబర్ 29 -- AR Rahman About Rockstar Songs: భారతీయ సినీ సంగీత చరిత్రలో 'రాక్‌స్టార్' (2011) ఒక మైలురాయి. తెలుగు సహా దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల ప్లేలిస్టులలో ఇప్పటికీ ఆ పాటలు మారుమోగుతూనే ఉంటాయి. అలాంటి కల్ట్ ఆల్బమ్ అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు, ఆ సినిమా విడుదలైన తర్వాత కూడా 8 నెలల పాటు ఒక్క రూపాయి కూడా పారితోషికం అందలేదంటే నమ్మగలరా? అవును, స్వయంగా రెహమాన్ ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

డెహ్రాడూన్ లిటరేచర్ ఫెస్టివల్ 8వ ఎడిషన్‌లో భాగంగా దర్శకుడు ఇంతియాజ్ అలీతో కలిసి ఏఆర్ రెహమాన్ ఒక ప్రత్యేక చిట్ చాట్‌లో పాల్గొన్నారు. తమ 15 ఏళ్ల విజయవంతమైన ప్రయాణంలో 'రాక్‌స్టార్', 'హైవే' వంటి చిత్రాల వెనుక జరిగిన పలు ఆసక్తికర, విస్మయపరిచే సంఘటనలను వీరిద్దరూ ప్రేక్షకులతో పంచుకున్నారు.

'రాక్‌స్టార్' సినిమాకు పనిచేసే సమయంలో ఎదురైన చేద...