భారతదేశం, సెప్టెంబర్ 17 -- నైపుణ్యం కలిగిన నర్సులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్ వసుధ ఫలితాలను ఇస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద తొలి విడతలో ఎంపికైన ముగ్గురు నర్సులు జర్మనీలో భాషా శిక్షణ, ఉద్యోగ అవకాశాల కోసం విమానమెక్కారు.

కాకినాడలోని ఆదిత్య నర్సింగ్ కళాశాలకు చెందిన నమిత, సనాయా సింగ్, శ్రీమాధురి కొర్ర అనే ముగ్గురు విద్యార్థినులు ఈ పథకం కింద మొదటి బ్యాచ్‌గా ఎంపికయ్యారు. జర్మనీ వెళ్లేముందు వీరికి రాజమహేంద్రవరంలో జర్మన్ భాషపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విదేశాలలో స్థ స్థానిక వాతావరణానికి, పని సంస్కృతికి అలవాటు పడేలా APSSDC ఈ శిక్షణా కార్యక్రమాలను రూపొందించింది.

జర్మనీ చేరుకున్న తర్వాత ఈ నర్సులు ఆరు నెలల పాటు B2-లెవల్ జర్మన్ భాషా ...