భారతదేశం, మార్చి 18 -- రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా 'దివ్యాంగ శక్తి' పథకాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ పథకానికి ఇవాళ అమరావతిలో శ్రీకారం చుడతారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే దివ్యాంగ శక్తిని ప్రారంభించనున్నాను.

ప్రస్తుతం 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, 100 శాతం కంటి చూపు కోల్పోయిన వాళ్లకు, 100 శాతం మూగ, చెవిటి వారికి, అలాగే 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న మానసిక దివ్యాంగులు మాత్రమే ఏపీఎస్‌ ఆర్టీసీ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వీరికి 50 శాతం రాయితీ లభిస్తోంది. 100 శాతం అంధత్వం, మానసిక వైకల్యం ఉన్నవారితో...