భారతదేశం, నవంబర్ 22 -- పవిత్రమైన కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం డిపో ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పంచారామాలు, శబరిమల, శ్రీశైలం క్షేత్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించినట్లు విజయనగరం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలను ఒకే యాత్రలో దర్శించుకునేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవంబర్ 15, 22, 29, డిసెంబర్ 5 తేదీలలో ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఆదివారం సాయంత్రం 4 గంటలకు విజయనగరం బస్ స్టేషన్ నుంచి బయలుదేరి, సోమవారం ఐదు క్షేత్రాల దర్శనం పూర్తి చేసుకుని, తిరిగి మంగళవారం ఉదయం 6 గంటలకు విజయనగరం చేరుకుంటాయి. సూపర్ లగ్జరీ బస్సులో రూ...