భారతదేశం, జూలై 11 -- APSDMA Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి రిక్రూట్ మెంట్ అప్డేట్ వచ్చింది. సంస్థలో ఖాళీగా ఉన్న సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ కాంట్రాక్టు గడువును ఎప్పటికప్పుడు పొడిగించే అవకాశం ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టును భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.61,500 చొప్పున వేతనం అందిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 45 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులు ఏపీఎస్డీఎంఏ నెట్‌వర్క్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎల్‌ఏఎన్/డబ్ల్యూఏఎన్ (LAN/WAN), రూటర్లు, స్విచ్‌లు, ఫైర్‌వాల్స్, వీపీఎన్, వై-ఫై కాన్ఫిగరేషన్ మరియు ట్ర...