భారతదేశం, మే 27 -- Apsara Awards: మహిళల శక్తి, సామర్థ్యాలు, సాధించిన విజయాలు, వారి లెగసీకి సెల్యూట్ చేస్తూ.. జీ తెలుగు (Zee Telugu) తమ ప్రతిష్టాత్మక వేడుక 'అప్సర అవార్డ్స్ 2026' (Apsara Awards 2026)తో మన ముందుకు రాబోతోంది. గ్లామర్, ఎమోషన్, ఇన్‌స్పిరేషన్ కలగలిపిన ఈ గ్రాండ్ ఈవెంట్ ఈ శనివారం (మే 30) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగు ఛానల్‌లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.

ఈ స్టార్ల వేడుకను పాపులర్ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ తమదైన స్టైల్లో పవర్‌ఫుల్ ఓపెనింగ్ యాక్ట్‌తో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జీ తెలుగు 'అప్సరసల' (సీరియల్ నటీమణులు) మెస్మరైజింగ్ ర్యాంప్ వాక్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. వీటితోపాటు పలు ఇతర ప్రధాన పర్ఫార్మెన్స్ లు ఉర్రూతలూగించనున్నాయి.

గ్లామర్ డ్యాన్స్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి, మాజీ మిస్ ఇండియా మానస వ...