APREIS 2026 : ఏపీ గురుకుల విద్యాలయాల సొసైటీలో 5వ తరగతి అడ్మిషన్లు - దరఖాస్తు తేదీలివే
భారతదేశం, మార్చి 3 -- ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీలో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా 6,7,8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా భర్తీ చేస్తారు.
5వ తరగతిలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 4వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన విద్యార్థులు https://aprs.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా ఒక మొబైల్ నెంబర్ ను ఒక్క దరఖాస్తుకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఆధారంగా ఓటీపీ నిర్ధారించబడుతుంది. అప్లికేషన్ లో విద్యార్థి పేరు, ఆధార్ నెంబర్, పుట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.