భారతదేశం, నవంబర్ 9 -- APPSC Group 1 Application : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 166 అత్యున్నత స్థాయి గ్రూప్-1 పోస్టుల భర్తీకి గాను ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి నేడే చివరి తేదీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కమిషన్ సూచించింది.

ఆఖరి నిమిషంలో వెబ్‌సైట్ ( https://portal-psc.ap.gov.in ) పై తీవ్ర సర్వర్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, నిరుద్యోగ అభ్యర్థులు గడువు ముగిసేవరకు వేచి చూడకుండా తక్షణమే అప్లై చేయాలని అధికారులు స్పష్టం చేశారు. డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, డీఈఓలు వంటి కీలక పరిపాలనా పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

గ్రూప్-1 పోస్టులకు నిర్వహి...