భారతదేశం, నవంబర్ 21 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) తీపికబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రత్యక్ష నియామకాల కోసం ఇటీవల విడుదల చేసిన ఆరు కీలక ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. అభ్యర్థుల నుండి పెద్ద ఎత్తున అందిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

తాజా నిర్ణయం ప్రకారం, ఆయా పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 7, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇదే చివరి అవకాశమని, భవిష్యత్తులో దరఖాస్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పొడిగించబోమని కమిషన్ స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోట్ ప్రకారం గడువు పొడిగి...