భారతదేశం, అక్టోబర్ 11 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ పరిధిలోని విజయవాడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ (CTI) లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. శిక్షణ ఇచ్చే ఆసక్తి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన నిపుణత ఉన్న అనుభవజ్ఞులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని బ్యాంక్ వర్గాలు సూచించాయి.

ఆప్కాబ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మొత్తం 2 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమికంగా 3 సంవత్సరాల కాలపరిమితికి కాంట్రాక్ట్ నియమాకం ఉంటుంది. ప్రతి సంవత్సరం వారి పనితీరును సమీక్షించి కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తారు.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీతో పాటు CAIIB ఉత్తీర్ణత లేదా డిప్లొమా ఇన్ కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి...