భారతదేశం, ఆగస్టు 8 -- APCOB Apprentice Recruitment 2026 : బ్యాంకింగ్ రంగంలో తమ వృత్తిపరమైన ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకునే యువతకు విజయవాడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) మంచి అవకాశం కల్పించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏడాది కాలపరిమితితో వివిధ విభాగాల్లో మొత్తం 25 అప్రెంటిస్ స్థానాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఉన్న 25 అప్రెంటిస్ ఖాళీలలో 7 పోస్టులను ప్రత్యేక విభాగాలుగా.. మిగిలిన 18 పోస్టులను జనరల్ కేటగిరీగా వర్గీకరించారు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్ పోస్టులకు వ్యవసాయం/హార్టికల్చర్/వెటర్నరీ, ఐటీ పోస్టులకు కంప్యూటర్ సైన్స్/ఐటీ/...