భారతదేశం, ఫిబ్రవరి 22 -- చేనేత రంగ అభివృద్ధికి, ఆప్కో బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పన లక్ష్యంగా పలు సంస్థలతో ఆప్కో ఒప్పందం చేసుకుంటోంది. దీనిలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తోనూ ఆప్కో ఒప్పందం చేసుకుంది.

కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకునే భక్తులకు వేదాశీర్వచనంలో అందజేసే కండువాలు, దుపట్టాలు, కాటన్ బ్లౌజ్ లు టీటీడీకి సరఫరా చేయడానికి ఆప్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు టీటీడీ మార్కెటింగ్ శాఖ నుంచి ఆర్డర్ కాపీ ఆప్కో కు వచ్చింది. టీటీడీ నుంచి ఆప్కో కు ఇటువంటి ఆర్డర్ ఇదే మొదటిసారి కావడం విశేషం.

తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఉంటున్నారు. తిరుమలకు విచ్చేసే వీఐపీలకు వె...