భారతదేశం, మే 14 -- Anushka Shetty: ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. లేడీ ఓరియంటెడ్ బ్లాక్ బస్టర్లు.. అనుష్క శెట్టి అనగానే సినీ లవర్స్ కు ఇవే గుర్తుకొస్తాయి. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆమె. ఏడాదికి 6 సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ స్లో అయిపోయింది. 8 ఏళ్లలో నాలుగే చిత్రాల్లో నటించింది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. పీక్స్ లో ఉండగానే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేయ్యాలి. ఆ తర్వాత ఛాన్స్ లు రావు. ఇప్పుడు అనుష్క శెట్టి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. 2005లో సూపర్ మూవీతో డెబ్యూ చేసిన ఈ భామ ఈ 20 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

అనుష్క శెట్టి ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగింది. 2008లో ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క మగా...