భారతదేశం, ఏప్రిల్ 26 -- Anushka Sharma Top Watch Price At IPL: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో అందరి కళ్లు హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మపైనే నిలిచాయి. భర్త విరాట్ కోహ్లీ ఆటను ఎంజాయ్ చేస్తూనే, తన స్టైలిష్ లుక్‌తో గ్యాలరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది అనుష్క శర్మ.

అనుష్క శర్మ ఫ్యాషన్ ఎప్పుడూ 'అతి'గా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటూనే అత్యంత ఖరీదైన బ్రాండ్లను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. ఈ మ్యాచ్‌లో కూడా ఆమె అదే 'క్వైట్ లగ్జరీ' ట్రెండ్‌ను ఫాలో అయింది.

ఈ మ్యాచ్ కోసం అనుష్క శర్మ ప్యారిస్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ 'Sezane' నుంచి ఎంచుకున్న 'రొడాల్ఫో బ్లౌజ్' (Rodolfo Blouse) ధరించింది. స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉన్న ఈ టాప్ మీద ఉన్న ఎంబ్రాయిడరీ, వి-నెక్ డిజైన్ ఆమెకు మరింత కళను తెచ్చిప...