భారతదేశం, ఆగస్టు 17 -- Anurag Kashyap About Bollywood Bends Easily To Power: భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి బాలీవుడ్ వర్గాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందీ చలనచిత్ర పరిశ్రమ అధికారం, రాజకీయాల ఒత్తిళ్లకు చాలా త్వరగా లొంగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బాలీవుడ్ వర్సెస్ సౌత్ సినిమా నడుమ ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.

ఒక్కసారి ఒత్తిళ్లకు తలొగ్గి రాజీపడటం మొదలుపెడితే, దాని నుంచి బయటకు రావడం సాధ్యం కాదని అనురాగ్ కశ్యప్ తెలిపారు. మొదటి రాజీ తర్వాత వచ్చే ప్రయోజనాలు, లాభాలకు అలవాటు పడిపోవడం వల్లే ఎవరూ ఆ తలుపులను మూసివేయలేకపోతున్నారని ఆయన చెప్పారు.

"సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తాము చేస్తున్న రాజీలు ఏం...