భారతదేశం, అక్టోబర్ 20 -- Anurag Kashyap: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా హిందీ చిత్రసీమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌పై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కేవలం దేశభక్తి లేదా దైవ భక్తి నేపథ్యం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని, కొత్త ఆలోచనలు, విభిన్న కథాంశాలతో వచ్చే చిత్రాలను ఓకే చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావడం లేదని ఆయన స్పష్టం చేశారు.

గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండిపెండెంట్ మూవీ 'లిటిల్ థామస్' (Little Thomas) కు అనురాగ్ కశ్యప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 23న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన ఆయన.. ప్రస్తుత హిందీ సినీ పరిశ్రమ పరిస్థితిపై తన ఆవేదన...