భారతదేశం, ఏప్రిల్ 30 -- Anupama Bhogi: విభిన్న కథలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్ మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'భోగి' మూవీలో అనుపమ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది వైరల్ గా మారింది.

అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్

శర్వానంద్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'భోగి' తెరకెక్కుతోంది. ఇందులో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ ను గురువారం (ఏప్రిల్ 30) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా అనుపమ కనిపించింది. తలపై బుట్టలో ఆకుల కట్టలతో, భుజానికి కూడా ఆకులు వేలాడేసుకుని ఆమె వెళ్తున్నట్లు ఉంది. మరో చేతిలో క్యారేజీ ఉంది.

పేరు ఇదే

భోగి నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ ...