భారతదేశం, మార్చి 11 -- ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. పీఎం కిసాన్ యోజన 22వ విడుదల నిధులను మార్చి 13వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేస్తారని కేంద్రం ప్రకటించింది. అయితే పీఎం కిసాన్ యోజన డబ్బులతో అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం.

దీంతో ఉగాదికంటే ముందుగానే మార్చి 13వ తేదీన అన్నదాతల ఖాతాల్లోకి సుమారు రూ.6000 జమ అవుతాయి. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతీ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన రైతులకు రూ.20వేల ప్రభుత్వం అందజేస్తోంది. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం నుంచి రూ.14000, పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 అందిస్తున్నారు.

మూడు విడుతల్లో భాగంగా ఈ నిధులు జమఅవుతాయి. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధుల విడుదలకు కేంద్...