భారతదేశం, ఏప్రిల్ 18 -- Anil Venky OTT: అపజయమే తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడి. 9 సినిమాలు తీసిన అతను, అన్ని హిట్లు కొట్టాడు. ఒక్కో సినిమాకు తన కలెక్షన్ల రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు. దీంతో ఈ డైరెక్టర్ కు క్రేజ్ మూమూలుగా ఏర్పడలేదు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టకముందే ఓటీటీ డీల్ పూర్తి కావడమే అందుకు నిదర్శనం.

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ తో మల్టీస్టారర్ చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించేశాడు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. పూజ కార్యక్రమం కూడా నిర్వహించలేదు. కానీ ఈ మూవీ ఓటీటీ డీల్ కంప్లీట్ అయిందనే బజ్ వైరల్ గా మారింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీ ఓటీటీ డీల్ అదిరిందనే టాక్ ఉంది. ఈ హీరోలతో...